VIDEO: డ్రైవింగ్ చేస్తూ వీడియోలు.. సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
HYD: డ్రైవింగ్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చూడటం కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టే నేరమని సీపీ సజ్జనార్ తెలిపారు. క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాల్సిన చేతులే ఇలా వినోదం మోజులో పడితే ప్రజల భద్రతకు గ్యారెంటీ ఎవరని 'X' వేదికగా ట్వీట్ చేశారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.