ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం: కలెక్టర్
BHPL: ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మాతా-శిశు మరణాలు తగ్గించాలని స్పష్టం చేశారు. తనిఖీ సమయంలో MRO స్వరూప రాణి ఉన్నారు.