ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

మన్యం: పాలకొండ డివిజన్ పరిధిలో ప్రాంతీయ నిఘా శాఖాధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్&ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు 15 బృందాలతో పాలకొండ, భామిని, బత్తిలి తదితర గ్రామాలలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాకు చేరిన యూరియా ఈ- పాస్ విధానం ద్వారా ప్రతి రైతుకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు.