పై కప్పు పెచ్చలూడి వ్యక్తికి తీవ్ర గాయాలు
ప్రకాశం: RTC బస్టాండ్‌లో పై కప్పు పెచ్చులు ఊడి పడడంతో ప్రయాణికుడికి తీవ్ర గాయాలైన ఘటన కొరిశపాడు(M) మేదరమెట్లలో జరిగింది. క్షతగాత్రుడు అద్దంకి(M) కలువలూరుకు చెందిన రాములుగా గుర్తించారు. నిన్న అతడు తన పని ముగించుకుని బస్టాండ్‌లో అద్దంకి వెళ్లేందుకు వేచి ఉన్న క్రమంలో పై కప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స అందించారు.