కుక్కల దాడిలో నాలుగేళ్ల పాపకి గాయాలు

కుక్కల దాడిలో నాలుగేళ్ల పాపకి గాయాలు

KMM: వీధి కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల పాప పై తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మోటమర్రి గ్రామపంచాయతీలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల పాపపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పాపని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.