సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో
VZM: తొలాపి సచివాలయాన్ని ఎంపీడీవో వాసుదేవారావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతన్న కోసం కార్యక్రమంపై సమీక్ష చేపట్టారు. అలాగే సాగుతున్న సర్వేలు, పనుల పురోగతిపై సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సిబ్బంది పనితీరును పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానంపై మార్గదర్శకాలు అందించారు.