'సేంద్రియ వ్యవసాయమే ఆరోగ్యానికి పునాది'
SRPT: ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా గడ్డిపల్లి కేవీకేలో శుక్రవారం కిసాన్ మేళా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జీ. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఆరోగ్యకరమైన నేలలే ఆరోగ్యకరమైన నగరాలకు పునాది" అని స్పష్టం చేశారు. రైతులు రసాయనాలు తగ్గించి, తప్పక సేంద్రియ ఎరువులు వాడాలని, సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలని సూచించారు.