ఆవును ఢీకొన్న కారు
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై రేణిగుంట మండలం మొలగమూడి గ్రామం వద్ద కారు ఆవును ఢీకొంది. కారు ముందు భాగం దెబ్బతిని ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను చూసి బైక్‌పై వెళ్తున్న యూనివర్సిటీ ఉద్యోగి చలపతి సడన్ బ్రేక్ వేయడంతో జారి కింద పడి గాయపడ్డాడు. హైవే అంబులెన్స్ సాయంతో అతడిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. తృటిలో పెను ప్రమాదంగా తప్పింది.