అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు

SRPT: మునగాల మండల కేంద్రంలో సబ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా.. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.