దేశంలో ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు: నిర్మలమ్మ
లాక్‌డౌన్‌పై ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇదంతా నిరాధార ప్రచారమంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజకీయ నేతలే ఇలా మాట్లాడటం ఆందోళనకరమని అన్నారు. దేశంలో ఎలాంటి లాక్‌డౌన్ ఉండదంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసిగట్టుగా పనిచేస్తూ పెట్రోల్, డీజిల్, LPG సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాయని తెలిపారు.