పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్

పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్

SS: హిందుపురం మండలం లేపాక్షి గ్రామ పరిధిలో రైతులు సాగు చేసిన పలు పంటల నమోదు ప్రక్రియను తహశీల్దార్ సౌజన్య లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. రైతులు సరస్వతమ్మ, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్ సాగు చేసిన రాగి పంటను పరిశీలించారు. అనంతరం ప్రొద్దుతిరుగుడు పంటను పరిశీలించి పంటల నమోదు వివరాలను ధ్రువీకరించారు. ఈ-క్రాప్ నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని రైతులకు సూచించారు.