జిల్లాలో 40 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి

SRD: జిల్లాలో 40 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలల్లో శుక్రవారం విధుల్లో చేరాలని సూచించారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను అభినందించారు.