వైన్స్ షాపులో దొంగతనం

వైన్స్ షాపులో దొంగతనం

VKB: యాలాలలోని బస్టాండ్ సమీపంలోని వైన్స్ షాపులో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఇద్దరు దొంగలు షాపు పైభాగంలోని ఇనుప రేకులను కోసి లోపలికి వెళ్లారు. కౌంటర్‌లో ఉన్న రూ. 5,000 నగదుతో పాటు రెండు క్వార్టర్ సీసాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.