గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం

MDK: శివంపేట మండల వ్యాప్తంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దపులి రవి, జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఇటీవల భారీ వర్షాలతో చెరువులు కుంటలు తెగిపోయాయని, మరమ్మత్తులు చేయాలని వారు కోరారు.