బంగ్లాలో ఎన్నికలు జరిగేది అప్పుడే: యూనస్

బంగ్లాలో ఎన్నికలు జరిగేది అప్పుడే: యూనస్

బంగ్లాదేశ్‌లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్నకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య జరగొచ్చని తెలిపారు. కొన్ని సంస్కరణలు చేపడుతున్నామని, అవి పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. తమ దేశ ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.