BREAKING: అకౌంట్లలోకి రూ.15 వేలు

AP: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 'తల్లికి వందనం' పథకం ఈ నెలలోనే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు అందించనున్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పథకం అమలు చేసేలా సర్కార్ ప్రణాళిక చేస్తోంది. కాగా.. గతంలో అమ్మఒడి పేరిట ఉన్న పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చిన విషయం తెలిసిందే.