ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయండి: MLA

ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయండి: MLA

VZM: భోగాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు, కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే నాగమాధవి శనివారం నిర్వహించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు, చిన్న మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత, భద్రతా చర్యలు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. కాంపౌండ్ వాల్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.