రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఆరేపల్లికి చెందిన కూస అంజి రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వరేపాక నుండి ఆరేపల్లి వెళ్తుండగా వరి ధాన్యం కుప్పలను ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు అంబులెన్సులో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.