"రైతులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి'

పల్నాడు: బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో నాబార్డ్, సెర్చ్ ఆధ్వర్యంలో శనివారం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఓ మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు అనేక రకాలైన సబ్సిడీ పధకాలు ఉన్నాయని వాటిని సంఘటితంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పీఓ ఎండీ, డైరెక్టర్‌లు రైతులు పాల్గొన్నారు.