పుట్టపర్తిలో రైతులకు యూరియా పంపిణీ
సత్యసాయి: పుట్టపర్తి ప్రాథమిక సహకార సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి 140 మంది రైతులకు 280 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని ఎమ్మెల్యే సింధూర రెడ్డి అన్నారు. ఒక్కో యూరియా బస్తా రూ. 266.50లకే రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు.