ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్ లోగో ఆవిష్కరించిన కలెక్టర్
WGL: హన్మకొండ,వరంగల్ జంట నగరాల్లోని అబ్రాడ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు ఐక్యంగా ఏర్పాటుచేసిన ఓరుగల్లు కన్సల్టెన్సీ అసోసియేషన్ అధికారిక లోగోను శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆవిష్కరించారు. విదేశీ విద్య, ఇమిగ్రేషన్ సేవలను పారదర్శకంగా, నాణ్యంగా అందించాలనే లక్ష్యంతో ఈ అసోసియేషన్‌ను స్థాపించినట్లు నిర్వాహకులు తెలిపారు.