గ్రామదేవతల సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి
నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు, కృష్ణపట్నం ప్రాంతాల్లో గ్రామదేవతలైన శ్రీ మారెమ్మ సహిత తాళ్లమ్మ, శ్రీ మారెమ్మ తల్లిని MLA సోమిరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని ఆయన ప్రార్థించారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.