VIDEO: గిరిజనులకు ఇళ్ల పట్టాలు వచ్చేలా చర్యలు: మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరిలోని కాశిరెడ్డి గిరిజన కాలనీలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం పర్యటించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన కాలనీలో సుమారు 30 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయని, ఇళ్ల పట్టాలు మంజూరయ్యేలా చూడాలని కోరగా సమస్యను రెవిన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇళ్ల పట్టాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.