ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు

KNR: ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటలో అత్యధికంగా 41.7°C ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో 41.5°C నమోదైంది. కరీంనగర్ జిల్లా మల్యాలలో 40.7, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 38.8°C నమోదయ్యాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది.