విష ద్రావణం తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

ATP: గుత్తికి చెందిన రామలక్ష్మి అనే వివాహిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.