యానాది కాలనీ, స్మశానానికి రోడ్డు ఏర్పాటు
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ యానాది కాలనీకి, స్మశానానికి కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామా సర్పంచ్ చంద్రశేఖర్ ఆదివారం జేసీబీ సహాయంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.