USకు ఇరాన్ సవాల్.. చమురు రవాణాపై నిఘా
హర్మూజ్ జలసంధి వద్ద US బలగాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) ప్రకటించింది. ఈ జలసంధి మీదుగా ఇంధన సరఫరాకు తమ దళాలతో రక్షణ కల్పిస్తామన్న US ప్రకటనపై IRGC ఘాటుగా స్పందించింది. US దళాలతో తలపడేందుకు తాము వేచి చూస్తున్నామని వెల్లడించింది. ఈ హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.