ABS తప్పనిసరి.. ఇప్పట్లో లేనట్లే..!
బైక్‌లలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయడాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఈ గడువును 2026 జనవరి 1గా ప్రతిపాదిస్తూ తయారీ సంస్థల అభిప్రాయాన్ని కేంద్రప్రభుత్వం కోరింది. అయితే దీన్ని అమల్లోకి తీసుకురావడానికి మరికొంత సమయం కావాలని కంపెనీలు కోరాయి. కాగా, ABSను తప్పనిసరి చేస్తే.. ధరలు పెరిగే అవకాశం ఉన్నాయి.