బాధితులను పరామర్శించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురంలో వైసీపీ నాయకుడు వెంకటనారాయణ రెడ్డిని పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, పాము కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కండ్లగూడూరు గ్రామానికి చెందిన వీరనారాయణ కుమారుడిని కూడా పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.