ప్రత్యేక అలంకరణలో విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పచ్చి బఠాణిలు, నెల్లికాయలు, పెసరపప్పు, వేపాకు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.