ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకు ప్రత్యేక బస్సు: డీఎం దానమ్మ
W.G: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి నవంబర్ 3న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ దానమ్మ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిగూడెం నుంచి ర్యాలీ, వాడపల్లి, అయినవిల్లి, ముక్తేశ్వరం, మురమళ్ళ, కుండలేశ్వరం, పలివెల క్షేత్రాలను సందర్శించి తిరిగి బస్సు తాడేపల్లిగూడెం చేరుకుంటుందన్నారు.