రైతు ఆదాయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

రైతు ఆదాయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

PPM: సీతానగరం మండలం కోట సీతారాంపురంలో ధాన్యం కొనుగోలును కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలపై అయన ఆరా తీశారు. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. గోనె సంచులు, రవాణా సౌకర్యం ఆర్బీకేల నుండే కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. రవాణా ఖర్చు రైతులకే చేరుతోందా లేదా అని అడిగారు.