VIDEO: ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన

NGKL: కోడేరు మండలం గుండ్యే వాలియా నాయక్ తండలోని అంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తండాలోని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆలయం ముందు ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. అనంతరం ధ్వజస్తంభం చుట్టు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది.