రేపు జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి
WGL: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన భద్రకాళీ, వెయ్యి స్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాకతీయ మెగా టెక్స్‌స్టైల్ పార్క్‌ను సందర్శిస్తారు. అనంతరం కాజీపేట, అయోధ్య పురంలోని రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను పరిశీలిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు.