పెన్నానదిలో మృతదేహం లభ్యం

పెన్నానదిలో మృతదేహం లభ్యం

NLR: నెల్లూరు రూరల్‌ మండలంలోని సుభాన్‌ నగర్‌ వద్ద పెన్నానదిలో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. సుమారు 30 - 40 సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నది ఎగువలో పడిపోయి ఇక్కడికి  కొట్టుకొని కొట్టుకొచ్చాడాని భావిస్తున్నట్లు తెలిపారు. అతని ఛాతి మీద కుమారి అనే పచ్చబొట్టు ఉందని, ఎవరైనా గుర్తిస్తే PSను సంప్రదించాలని సూచించారు.