VIDEO: దేవాదాయ శాఖ మంత్రి జన్మదిన ప్రత్యేక పూజలు

SRCL: మంత్రి కొండా సురేఖ జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఈవో రాధాబాయి నేతృత్వంలో అర్చకులు కొండా సురేఖ పేరు మీద అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. మంత్రి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాజన్నను కోరినట్లు తెలిపారు.