హమాలీ కార్మికుల అర్థనగ్న నిరసన

BNGR: పెంచిన కూలి రేట్ల జిఓ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట ఎంఎల్ఎస్ గోడౌన్ వద్ద హమాలి కార్మికులు ఆదివారం అర్ధనగ్న నిరసన తెలిపారు. AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ మాట్లాడుతూ.. సివిల్ సప్లయి కమిషనర్, ఏఐటీయూసీ నాయకుల సమక్షంలో జరిగిన చర్చలకు సంబంధించిన జీవో కాపీ విడుదల చేయడంలో ప్రభుత్వం, సివిల్ సప్లయి కమిషనర్ పూర్తిగా విఫలం అయ్యారన్నారు.