VIDEO: శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం ఘనంగా
WNP: వీపనగండ్ల మండలంలోని గోపాల్ దిన్నెలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.