రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NGKL: వంగూర్ మండలం వెలుమలపల్లి వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. కోనేటి పూర్ గ్రామానికి చెందిన రింగు శ్రీను కారులో కల్వకుర్తికి వెళ్తుండగా.. రహదారిపైకి వచ్చిన వరి కోత మిషన్ బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీనును 108 సిబ్బంది వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.