రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
BDK: సుజాతనగర్ మండలం వేపలగడ్డ జియో బంకు వద్ద నందనవనం కాలనీకి వెళ్లే రోడ్డు దగ్గర కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహన దారుడు ఎడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిందని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన కారులోనే క్షతగాత్రుడిని కొత్తగూడెం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.