ఎండ వచ్చిన తర్వాతే పత్తిని తెంపాలి: కలెక్టర్

ఎండ వచ్చిన తర్వాతే పత్తిని తెంపాలి: కలెక్టర్

NLG: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మునుగోడు, మర్రిగూడలలో సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను  నిన్న రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ఎండ వచ్చిన తర్వాతే పత్తిని తెంపాలని, అప్పుడు తేమ శాతం 8–12% మధ్య ఉండి కొనుగోలుకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. తేమ సరైన స్థాయిలో ఉంటే వెంటనే కొనుగోలు చేయాలని సీసీఐ అధికారులకు ఆదేశించారు.