అలిమేలులో 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమం

TPT: సత్యవేడు మండలం అలిమేలు మంగాపురంలో శనివారం టీడీపీ నాయకులు 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన శంకర్ రెడ్డి డోర్ టు డోర్ కరపత్రాలు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆగస్టులో ఉచిత బస్సు, రైతు భరోసా పథకాలు అమలుకానున్నాయని చెప్పారు. పథకాలు అందకపోతే తనకు తెలపాలని కోరారు.