ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

GNTR: తాడేపల్లిలో ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. తాడేపల్లిలోని హైవే మధ్యలో ఉన్న పోలీస్ పోస్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 45 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.