ఈ నెల 7న కాకినాడలో జాబ్ మేళా

KKD: ఈ నెల 7న కాకినాడ ఇంద్రపాలెం ఐడియల్ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సహకారం అందిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. మొత్తం 33 ప్రముఖ సంస్థలు పాల్గొని 1200 ఉద్యోగాలను అందించనున్నాయి.