కోనేరుకు కొత్త కళ తెచ్చిన హైడ్రా
MDCL: జగద్గిరిగుట్ట కోనేరుకు హైడ్రా కొత్త కళ తెచ్చింది. కోనేరు ఆక్రమణలను మంగళవారం హైడ్రా తొలగించింది. అందులో పేరుకుపోయిన పూడికను తరలించింది. దాదాపు 26 ట్రక్కుల వరకు ఉన్న నిర్మాణ వ్యర్ధాలు, చెత్తాచెదారాన్ని తొలగించి కోనేరుకు కొత్త కళను అందించింది. కోనేరునే కబ్జా చేయాలనుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. దీంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.