VIDEO: ఖమ్మం బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన
KMM: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ నేతృత్వంలో బుధవారం తెల్లవారుజామున ఖమ్మం బస్ డిపో వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తిస్తూ తమ హక్కుల సాధన కోసం సమ్మెలో పాల్గొన్నట్లు కార్మిక నేతలు స్పష్టం చేశారు.