అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం

BDK: పాల్వంచ పట్టణంలోని విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ కాలనీ వెనక వాకింగ్ ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.