విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ
విశాఖలో మంత్రి డా. పీ. నారాయణ శనివారం పర్యటించారు. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీతమ్మధారలోని మురికివాడను సందర్శించి, 30 ఏళ్లుగా నివసిస్తున్న 200 కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పగా, సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.