హైస్కూళ్లు, హాస్టళ్లు తనిఖీ చేసిన ఎంపీడీవో
AKP: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొలుగొండ మండలంలోని హై స్కూల్స్, హాస్టళ్లలో కిచెన్ గార్డెన్ల పరిస్థితిని బుధవారం ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలించారు. వంటగది, స్నాన గదుల్లో వినియోగించిన నీటిని వృథా చేయకుండా తోటల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కిచెన్ గార్డెన్లు కీలకమని పేర్కొన్నారు.