వాంగ్‌చుక్‌ నిర్బంధంపై నేడు సుప్రీం విచారణ

వాంగ్‌చుక్‌ నిర్బంధంపై నేడు సుప్రీం విచారణ

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిర్భంధాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ నిర్భంధించడం ప్రాథమిక హక్కులను భంగం కలిగించటమేనంటూ గీతాంజలి కోర్టును ఆశ్రయించారు. లద్దాఖ్‌లో జరిగిన హింసకు కారణమని ఆరోపిస్తూ వాంగ్ చుక్‌ను పోలీసులు నిర్భంధంలో ఉంచారు.